ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు..వీటి ఆధారంగానే ఫలితాలు: మంత్రి సబితా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు.
జూన్ 9వ తేదీన ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికే ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేశామని పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో అందరికీ గరిష్ట మార్కులు ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫలితాలు ఏ ప్రాతిపదికన ప్రకటించాలనే దానిపై కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. రెండు రోజుల్లో కమిటీ విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. పరీక్షలు రాయాలనుకునే వారికి పరిస్థితులు చక్కబడ్డాక అవకాశం ఇస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
☛ ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్మెంట్లను జూన్ 28లోగా అప్లోడ్ చేయండి
☛ 12వ తరగతి ఫలితాల వెల్లడికి ఏ ప్రక్రియను అనుసరిస్తారు..?
☛ 12వ తరగతి ఫలితాల వెల్లడికి ఏ ప్రక్రియను అనుసరిస్తారు..?
Published date : 09 Jun 2021 12:08PM