Skip to main content

ఇక స్కూల్‌ టీచర్లకు కూడా ఐడీ కార్డులు షురూ...

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు గుర్తింపు కార్డులిచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
జిల్లాలవారీగా టీచర్ల వివరాలను జిల్లా విద్యాశాఖాధికారులు ధ్రువీకరించి ఈనెల 24వ తేదీలోగా తమకు పంపించాలని సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.రమేశ్‌ డీఈవోలకు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు టీచర్లకు ఐడీకార్డులు లేవు. వారి ట్రెజరీ ఐడీల ఆధారంగానే వారిని గుర్తిస్తున్నారు. అయితే బయట ఎక్కడికైనా వెళ్లినప్పుడు టీచర్లుగా గుర్తింపు తెలియజేసే కార్డులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా టీచర్లకు గుర్తింపు కార్డులివ్వాలని స్పష్టంచేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానికసంస్థలు, ఎయిడెడ్, కేజీబీవీ, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్, మోడల్‌ స్కూల్స్, విద్యాశాఖ గురుకులాలకు చెందిన 1,16,864 మంది టీచర్లకు ఐడీ కార్డులిచ్చేలా చర్యలు చేపట్టింది. అందులో గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్లు–2,723 మంది, స్కూల్‌ అసిస్టెంట్లు–39,600, భాషా పండితులు–8,966, లో ఫిమేల్‌ లిటరసీ హెడ్‌మాస్టర్లు–2,386, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు–52,563, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు–2,127, స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు–516, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్రాయింగ్‌ టీచర్లు–2,591, కేజీబీవీ, అర్బర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ టీచర్లు–5,392 మంది ఇలా మెుత్తంగా 1,16,864 మంది టీచర్లకు గుర్తింపు కార్డులిచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
Published date : 13 Apr 2021 02:03PM

Photo Stories