ఇక ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఉద్యోగుల కొరతకు చెక్
Sakshi Education
సాక్షి, అమరావతి: కొత్తగా మంజూరైన 16 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, సిబ్బంది కొరత ఉన్న ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బందిని నియమించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అధికారులను నవంబర్ 30న ఆదేశించారు.
సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి సోమవారం ఈఎస్‌ఐ శాఖ అధికారులతో సమీక్షించారు. విశాఖపట్నం షీలా నగర్‌లోని 500 పడకల ఆస్పత్రి నిర్మాణానికి స్ధల సేకరణ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో కార్మికులకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు.
Published date : 01 Dec 2020 04:14PM