ఇక అనాథల సంరక్షణ బాధ్యత సర్కారుదే..!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: అనాథ బాలికలు, ఒంటరి మహిళల సంరక్షణ ఇక ప్రభుత్వమే చేపట్టనుంది.
ప్రభుత్వేతర సంస్థలు, ఎన్జీఓలు నిర్వహిస్తున్న హోంలలో ఆశ్రయం పొందుతున్న వారిపై దాడులు, వేధింపులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ మంత్రి.. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ అంశాన్ని ప్రస్తావించి, ప్రభుత్వ పరిధిలో సంరక్షణకు తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. అనాథ బాలికలు, ఒంటరి మహిళల (వృద్ధులు మినహా)కు ఏవిధంగా ఆశ్రయం కల్పించాలనే దానిపై కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఇటీవల అమీన్‌పూర్ సమీపంలో ఉన్న మారుతీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న హోంలోని బాలికపై జరిగిన హత్యను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది.
బాలికల విద్యాభ్యాసానికి నేరుగా అడ్మిషన్
బాలికలు, మహిళల సంరక్షణకు రెండంచెల్లో సంరక్షణ చర్యలు తీసుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్జీఓలు, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న హోంలలో ఉన్న పిల్లల వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కేంద్రాల్లో ఎంతమంది ఉన్నారో ఇప్పటికే ప్రాథమిక అంచనాలు రూపొందించారు. ఎన్జీఓల హోంలలో దాదాపు 3వేల మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో చదువుకునే పిల్లలను ఒక కేటగిరి, ఇతరులను మరో కేటగిరిగా విభజించి కార్యాచరణ చేపట్టనున్నారు. చదువుకునే పిల్లలను వారి వయసుకు తగినట్లుగా సంక్షేమ శాఖలు నిర్వహించే గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలు, విద్యాశాఖ నిర్వహించే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో చేర్చి అక్కడే ఆశ్రయం కల్పిస్తారు. గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలున్నా.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సిఫార్సు చేసిన వారిని నేరుగా చేర్చుకునేలా మార్గదర్శకాలు రూపొందించాలని మంత్రి సూచించారు. కేజీబీవీల్లోనూ ఇలాగే అడ్మిషన్లు ఇవ్వాలని యోచిస్తున్నారు.

Published date : 27 Nov 2020 02:04PM