Skip to main content

ఇగ్నోలో ఎంబీఏ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ద్వారా 2020 సంవత్సరానికి మేనేజ్‌మెంట్(ఎంబీఏ), పీహెచ్‌డీ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది.
ఈ పరీక్షలకు హాజరుకాదలచిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్ర సంచాలకులు డాక్టర్ ఎస్.ఫయాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు ఈ నెల 23వ తేదీ లోగా ఆన్‌లైన్ విధానంలో ఇగ్నో వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 29న ఉంటుందని తెలిపారు. ఇతర వివరాల కోసం 9492451812, 040-23117550 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు.
Published date : 16 Mar 2020 05:35PM

Photo Stories