Skip to main content

ఈ విద్యాసంవత్సరం నుంచి పాలిటెక్నిక్‌లో కొత్తగా 5 కోర్సులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్ డిజైనింగ్, 3-డీ యానిమేషన్-గ్రాఫిక్స్, యానిమేషన్-మల్టీమీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టింది.

ఈ కొత్త కోర్సులు రాష్ట్రంలోని అయిదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నట్టు నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులో పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కార్యక్రమాల కోసం రూ.14.50 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.

కాలేజీల వారీగా కోర్సులు, సీట్ల సంఖ్య

కాలేజీ

కోర్సు

సీట్ల సంఖ్య

సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, చేబ్రోలు, గుంటూరు జిల్లా

3-డీ యానిమేషన్

120

సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, చేబ్రోలు, గుంటూరు జిల్లా

యానిమేషన్-మల్టీమీడియా

120

సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, చేబ్రోలు, గుంటూరు జిల్లా

వెబ్ డిజైనింగ్

120

సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ, గుంటూరు జిల్లా

వెబ్ డిజైనింగ్

180

సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ, గుంటూరు జిల్లా

కంప్యూటర్ సైన్స్

120

కాకినాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెన్సైస్, అంబికపలి ్ల, తూ.గో. జిల్లా

ప్యాకేజింగ్ టెక్నాలజీ

60

కాకినాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, కోరంగి, తూ.గో. జిల్లా

3-డీ యానిమేషన్

120

ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్ ఫర్ ఉమెన్, నగరం, తూ.గో.జిల్లా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

60

Published date : 15 Oct 2020 02:55PM

Photo Stories