‘ఈ విద్యార్థులకు వీఐటీ–ఏపీలో ఫీజు మినహాయింపు’
Sakshi Education
అమరావతి: కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 25 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో 100% ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు వీఐటీ ఫౌండర్ అండ్ చాన్స్లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ తెలిపారు.
స్కాలర్‌షిప్‌లు మొత్తం రూ.62 లక్షలు ఉంటుందని పేర్కొంటూ ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ 25 మంది విద్యార్థులు వీఐటీ–ఏపీ వర్సిటీలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Published date : 05 Aug 2021 03:28PM