ఈ విద్యార్థులకు 'ఏఐసీటీఈ' స్కాలర్‌షిప్పులు..దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏఐసీటీఈ 2020–21 సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీపీఏటీ) స్కోరుతో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్, ఎంఆర్క్‌లలో చేరిన వారు అర్హులని తెలిపింది. వీరు www.aicte-india.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు డిసెంబర్ 31 గడువని వివరించింది. ఈ స్కాలర్‌షిప్ 24 నెలలపాటు విద్యార్థులకు అందుతుంది.
Published date : 20 Oct 2020 08:14PM