ఈ ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు: సీఎం కేసీఆర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాకాల శాసనసభ మూడో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ 9వ తేదీన అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు కీలకమైన కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రవేశ పెట్టిన బిల్లులకు సంబంధించిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదని హామీ ఇచ్చారు. వారిని స్కేల్ ఉద్యోగులుగా పరిగణిస్తామని తెలిపారు. వీఆర్వోలను ఏదైనా సమానస్థాయి ఉద్యోగానికి బదిలీ చేస్తామని పేర్కొన్నారు. వీఆర్‌ఎస్ లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం తీసుకువస్తామని చెప్పారు. రికార్డులను అక్రమంగా దిద్దడం, మోసపూరిత ఉత్తర్వులు చేయ కూడదన్నారు. అక్రమాలకు పాల్పడితే ఉద్యోగులపై చర్యలు, సర్వీసు నుంచి తొలగింపు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేయిస్తామని తెలిపారు. అన్ని వివరాలతో ధరణి పోర్టల్ ఉంటుందని చెప్పారు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ విభాగాలుగా ధరణి పోర్టల్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
Published date : 09 Sep 2020 03:55PM