ఈ పాఠశాలలో విద్యార్ధుల పరస్పర సంభాషణలు ఇంగ్లిష్‌లోనే..!
Sakshi Education
హిందూపురం సెంట్రల్: చదువుకు పేదరికం అడ్డుకారాదని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలంటూ విద్య యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ చిలమత్తూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ఆంగ్లంలో చేసిన స్కిట్ (లఘు నాటిక) అందరినీ ఆకట్టుకుంటోంది.
ఆంగ్లంలోనే పాఠ్యాంశాలు బోధిస్తూ.. చిన్నారులు ఇంగ్లిష్‌పై పూర్తి పట్టు సాధించేలా ఆ పాఠశాల ఉపాధ్యాయులు సాగించిన కృషికి ఫలితం దక్కింది. పేదరికం కారణంగా పల్లెటూళ్లలో 14 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా వారి తల్లిదండ్రుల సూచన మేరకు పనుల్లోకే వెళుతున్నారు. అలాంటి తల్లిదండ్రుల ఆలోచన విధానాల్లో విద్యార్థులు స్కిట్ మార్పు తీసుకువస్తోంది. తమ పిల్లలు సైతం ఇంగ్లిష్ మాట్లాడాలనే అభిలాష అందరిలోనూ వ్యక్తమవుతోంది.
ఆంగ్లం అభ్యాసంపై ఉత్సాహం
చాలా వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలోనే విద్యాబోధన ఎక్కువగా ఉండేది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉన్నతమైన ఆలోచనలతో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. దీంతో రూ.వేలు ఖర్చుతో ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు ఊరట దక్కడంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా చిలమత్తూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సైతం ఇంగ్లిష్ మీడియంలోనే పాఠ్యాంశాలు బోధిస్తూ విద్యార్థుల్లో ఆంగ్ల భాషాభివృద్ధికి బాటలు వేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో అత్యధికంగా విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. లఘు నాటికలను ప్రదర్శిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆంగ్లంలోనే బోధన
మా పాఠశాలలో ప్రతి అంశాన్ని ఉపాధ్యాయులు ఆంగ్లంలోనే బోధిస్తుంటారు. దీంతో మేము ఇంగ్లిష్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించగలిగాం. చాలా మంది అనుకుంటున్నట్లు ప్రైవేట్ పాఠశాలలకు వెళితేనే ఇంగ్లిష్ వస్తుందనుకుంటే పొరబాటు. మా స్కూల్‌లో అందరమూ ఇంగ్లిష్‌లోనే మాట్లాడుకుంటాం. మేము ఈ స్థాయికి చేరుకున్నామంటే అంతా మా టీచర్ల చలువనే.
– రెడ్డి లక్ష్మి , 9వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, చిలమత్తూరు
ప్రతి ఒక్కరూ చదువుకోవాలి
చదువు ద్వారానే ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి. 14 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరికీ చదువు చాలా అవసరం. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు సాధించుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు చాలా నాణ్యమైన విద్యాబోధనను అందిస్తున్నారు. ఇదే విషయంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఇంగ్లిష్‌లోనే మేము స్కిట్ చేశాం. చాలా మంది మమ్మల్ని అభినందించారు.
– హరిణి, 9వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్, చిలమత్తూరు

Published date : 01 Jun 2021 02:09PM