హెచ్‌సీయూలో పలు కొత్త కోర్సులు
Sakshi Education
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్తగా అమలుచేసే పలు నిర్ణయాలను శనివారం ప్రకటించారు.
హెచ్‌సీయూ క్యాంపస్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన 88వ అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ హెచ్‌సీయూ పీఆర్‌ఓ ఆశిష్ జాకబ్ థామస్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హెచ్‌సీయూలో 30 ఏళ్లుగా జాతీయ స్థాయిలో అగ్రశ్రేణిగా కొనసాగుతున్న కమ్యూనికేషన్ విభాగం స్థానంలో క్యాంపస్‌లో 13వ స్కూల్‌గా ఈ విభాగానికి స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్ హోదాను ఇవ్వడం విశేషం. దీని ద్వారా జాతీయ విద్యా విధానం ప్రకారం ఎంఫిల్ ప్రోగ్రాంను నిలిపి వేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రపంచంలోనే టాప్–100 విశ్వవిద్యాలయాల్లో స్థానం సంపాదించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను చేపడుతూ ముందుకుసాగాలని నిర్ణయించారు.
కొత్తగా ఏర్పాటయ్యే కోర్సులివే...
కొత్తగా ఏర్పాటయ్యే కోర్సులివే...
- మీడియా స్టడీస్, మీడియా ప్రాక్టీస్‌లో 2 ఎంఏ ప్రోగ్రాంలను, పీహెచ్‌డీ ప్రోగ్రాం లను నిర్వహిస్తారు.
- మోడలింగ్, సిమ్యులేషన్ లో కొత్త మల్టీ–డిసిప్లినరీ ఎంటెక్‌తో సహా కొత్త ప్రోగ్రాంకు ఆమోదం తెలిపారు.
- సంగీతంలో మాస్టర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కార్యక్రమం నిర్వహిస్తారు.
- ఉర్దూలో ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు ను మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయం.
- కమ్యూనిటీఐ హెల్త్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా, ఆప్తాల్మిక్ డిస్పెన్సింగ్ ఆప్టిక్స్‌లో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం.
- ఉమ్మడి పీహెచ్‌డీలకు వర్సిటీ సూత్రప్రాయంగా ఆమోదం
- అగ్రశ్రేణి విదేశీ వర్సిటీలతో ఎన్ఈపీలో తయారు చేసిన నిబంధనల ప్రకారం కొత్తగా ఏర్పాటు చేసే కోర్సులలో ప్రవేశం, అర్హత, డిగ్రీ సమానత్వం కోసం పద్ధతులను అమలు చేస్తారు.
- సహకార పరిశోధనను సులభతరం చేయడానికి, డాక్టోరల్ స్థాయిలో జాతీయ ప్రయోగశాలలతో సంబంధాలను ఏర్పర్చుకోవడానికి అకడమిక్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
Published date : 29 Mar 2021 04:16PM