హెచ్‌సీయూ – 2021 ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఆగస్టు/సెప్టెంబర్‌లో పరీక్షను నిర్వహించనున్నారు. వర్సిటీలో 17 ఇంటిగ్రేటెడ్, 46 పీజీ, 10 ఎంటెక్, 44 పీహెచ్‌డీ కోర్సుల్లో మొత్తం 2,328 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్(మోడలింగ్ అండ్ సిములేషన్), ఎంపీఏ(మ్యూజిక్), పబ్లిíషింగ్‌లో సర్టిఫికెట్ కోర్సులను కొత్తగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే ఎంసీఏ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో నిమ్‌సెట్, గేట్, జేఈఈ, క్యాట్, జీఏటీ–బీ తదితర పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఎంటెక్(మోడలింగ్ అండ్ సిములేషన్) కోర్సులో గేట్ స్కోరు ఆధారంగా ప్రవేశాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
చదవండి: జూన్ 21 నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం!
చదవండి: ‘కేజీబీవీ– 2021’ ప్రవేశాలకు గడువు జూలై 5 వరకు పొడిగింపు