హాస్టళ్లలో ఫైనలియర్ విద్యార్థులకు వసతి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఫైనలియర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు వెంటనే సంక్షేమ వసతిగృహాల్లో ఆశ్రయం కల్పించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలు ఈహెచ్‌ఎంఎస్‌లో పొందుపర్చామని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని తెలిపింది. పరీక్షలు ముగిసిన విద్యార్థులు వెంటనే వారి ఇళ్లకు తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కమిషనర్ యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు.
Published date : 19 Sep 2020 02:37PM