హార్టీకల్చర్ (బీటెక్) అభ్యర్థులు సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు అనర్హులు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌కు స్పందించి దరఖాస్తు చేసుకున్న వారిలో బీటెక్ (హార్టీకల్చర్) అభ్యర్థులు అనర్హులని ఉద్యానవన శాఖ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఏజెన్సీ ప్రాంతాలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న బీటెక్ (హార్టీకల్చర్) అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం మొదట నోటిఫికేషన్‌లో పేర్కొన్నదని, అయితే విద్యార్హతలు, సర్వీసు నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వీరిని అనర్హులుగా ప్రకటించినట్టు వివరణ ఇచ్చింది. అభ్యర్థులు ఈ మార్పును గుర్తించాలని పేర్కొంది.
Published date : 21 Sep 2020 03:32PM