గురుకుల న్యాయ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..వివరాలకు సంప్రదించండి..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో సంగారెడ్డి గిరిజన డిగ్రీ గురుకుల కళాశాలలో ప్రారంభించిన న్యాయ కళాశాలలో అడ్మిషన్లకు ఆశించినంత స్పందన రా లేదు.
ఇతర కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూ ర్తయ్యే సమయంలో గిరిజన న్యాయ కళాశాల కు అనుమతులు రావడం, ఆలస్యంగా అడ్మిషన్లకు ఆఫర్ ఇవ్వడంతో తక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో 60 సీట్లకు అనుమతి రాగా.. కేవలం 16 మాత్రమే భర్తీ అ య్యాయి. మిగిలిన 44 సీట్లను స్పాట్ అడ్మిషన్ల పద్ధతిలో భర్తీ చేయాలని నిర్ణయించిన సొసైటీ.. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంగారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అజయ్‌కుమార్‌ను (9398629059) సంప్రదించాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Published date : 16 Feb 2021 02:26PM