గురుకుల కళాశాలల్లో ప్రవేశాల జాబితా విడుదల
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలో నడుపుతున్న రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2020–21 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్‌లో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను ఏపీఆర్‌జేడీసీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు కేటాయించిన కళాశాలల వివరాలను ఈనెల 25న వెల్లడిస్తామన్నారు. ఎంపికైన విద్యార్థులు తమ ప్రొవిజనల్ సెలక్షన్ ఆర్డర్‌ను పైన పేర్కొన్న వెబ్‌సైట్ నుంచి పొంది, సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి, అదే సైట్‌లో ఈ–మెయిల్ ద్వారా ఈ నెల 26 నుంచి 30వ తేదీలోపు పంపాలని వివరించారు.
Published date : 18 Sep 2020 03:18PM