గ్రామీణ, గిరిజన విద్యార్థులకు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయండి: మేకపాటి
ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఒక నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో ‘నైపుణ్య వికాసం’ కార్యక్రమంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే నైపుణ్య వికాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇంగ్లి‹ష్, లైఫ్ స్కిల్స్, ఐటీ తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. నైపుణ్య వికాసం గురించి ఇంపాక్ట్ స్టడీ చేసి, ఆ నివేదిక ఆధారంగా తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. కాగా, విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లే రాష్ట్ర మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి మేకపాటి ఆదేశించారు. మంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో విదేశీ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా ఒక లక్ష్యం నిర్దేశించుకుని అందుకు ఒక మిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. రాబోయే ఏడాదిలో అందుకోవాల్సిన అంచనాలు, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
స్పోకెన్ ఇంగ్లీష్, జాబ్ గైడెన్స్, ఎంప్లాయ్‌బిలిటీ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కెరీర్ గైడెన్స్... మరెన్నో ఒకే చోట మీకోసం.. క్లిక్ చేయండి, ఉద్యోగవకాశాల్లో మెరవండి.
సాంఘిక సంక్షేమ విద్యార్థులకు ‘ఆంగ్లోదయం’
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 210 గిరిజన, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లి‹Ùపై పరిజ్ఞానం పెంచే విధంగా ‘ఆంగ్లోదయం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. గురువారం ఏపీటీఎస్ కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. 158 ఏపీ గురుకుల సంక్షేమ, 52 సాంఘిక సంక్షేమ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లిష్ భాషపై పట్టు సంపాదించేలా బోధన ఉంటుందన్నారు. ఇంటెల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇంగ్లీష్ హెల్పర్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, స్కూల్ నెట్ ఇండియా భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘రీడ్ మీ టూ’ పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.