గ్రామ సచివాలయ సంక్షేమం-విద్య అసిస్టెంట్ జాబ్ చార్ట్ విధులు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయ ఉద్యోగుల వారీగా ఏ ఉద్యోగి.. ఏ రోజు.. ఏ నెలలో.. ఏ విధులు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం జాబ్ చార్టులను రూపొందించింది.
ఈ ఉద్యోగుల్లో గ్రామ సచివాలయ సంక్షేమం-విద్య అసిస్టెంట్ కీలక పాత్ర పోషించనున్నారు. గ్రామ సచివాలయ సంక్షేమం-విద్య అసిస్టెంట్ రోజూ స్కూళ్లు, హాస్టళ్ల పర్యటనకు వెళ్లాలి. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, పెన్షన్ దరఖాస్తుల పరిశీలనతోపాటు ఆ డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
గ్రామ సచివాలయ సంక్షేమం-విద్య అసిస్టెంట్ విధులు ఇలా..
గ్రామ సచివాలయ సంక్షేమం-విద్య అసిస్టెంట్ విధులు ఇలా..
- రోజూ ఉదయం గ్రామ సచివాలయానికి రాగానే వివిధ వర్గాల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత విభాగాలకు పంపాలి. అనంతరం స్పందనలో వచ్చిన సమస్యల పరిష్కారంపై సహచర ఉద్యోగులతో సంప్రదింపులు చేయడంతోపాటు తన పరిధిలో అభివృద్ధి పనులపై చర్చించాలి.
- తన పరిధిలోని స్కూళ్లు, హాస్టళ్లను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుతెన్నులు పరిశీలించాలి. అలాగే నాడు-నేడు కింద చేపట్టిన పనుల పురోగతితోపాటు పనుల నాణ్యతను తెలుసుకోవాలి.
- బ్యాంకులకు వెళ్లి డ్వాక్రా సంఘాలు, గృహాల లబ్ధిదారులకు రుణాలిప్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
- సాధారణ విధులతోపాటు పంచాయతీ కార్యదర్శి, ఇతర పై అధికారులు చెప్పే పనులు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేపట్టే ప్రత్యేక కార్యక్రమా
- లన్నింటికీ హాజరు కావాలి.
- మధ్యాహ్నం నుంచి సచివాలయంలో సంబంధిత ఫైళ్లను పరిష్కరించడంతోపాటు ఆన్‌లైన్ సర్వీసులు, మాన్యువల్ సర్వీసులకు అందుబాటులో ఉండాలి.
- వైఎస్సార్ బీమా క్లెయిమ్స్ డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. డ్వాక్రా సంఘాల రుణ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.
- వైఎస్సార్ పెళ్లికానుక దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు నిర్వహించడంతోపాటు డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయాలి. సంక్షేమ కార్పొరేషన్ల నుంచి ఆయా వర్గాలకు రుణాలను మంజూరు చేయించాలి.
- గృహ నిర్మాణాలను పరిశీలించడంతోపాటు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీతోపాటు, జగనన్న అమ్మఒడి, వసతి దీవెన లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.
- పింఛన్ దరఖాస్తులను పరిశీలించడంతోపాటు డిజిటల్ అసిస్టెంట్ సహకారంతో అన్ని పథకాలు, కార్యక్రమాల వివరాలను అప్‌డేట్ చేయాలి.
- డ్వాక్రా సంఘాలు, గ్రామ సంఘాల సమావేశాలకు హాజరవ్వాలి. అలాగే స్వయంఉపాధి యూనిట్లను సందర్శించాలి.
- పింఛన్ డబ్బుల పంపిణీని పర్యవేక్షించడంతోపాటు ఏమైనా సమస్యలుంటే గ్రామ వలంటీర్లతో కలిసి పరిష్కరించాలి. - చదువులో వెనుకబడిన, లేదా తరచూ గైర్హాజరు అవుతున్న
- స్కూల్‌కు రావడం మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలి.
- పతి నెలాఖరున పౌరహక్కుల రోజును నిర్వహించాలి. అంటరానితనం, బాల కార్మిక వ్యవస్థ, జోగిని వ్యవస్థల నిర్మూలనకు ప్రజలను చైతన్యపరచాలి.
- స్కూళ్ల తల్లిదండ్రుల కమిటీల సమావేశాలను నిర్వహించడంతోపాటు అన్ని సంక్షేమ
- పథకాలకు చెందిన లబ్ధిదారుల దరఖాస్తులను వెరిఫికేషన్ చేయాలి.
Published date : 24 Feb 2020 03:33PM