గిరిజన యువతకు ‘టాస్క్’ కెరీర్ గెడైన్స్ సెల్ ప్రారంభించిన జయేశ్ రంజన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గిరిజన యువత తమ కెరీర్‌లో అత్యున్నత స్థానం చేరుకునేందుకు తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ ‘టాస్క్’చేపట్టిన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం-2020 (ఆదివాసీ దివస్) సందర్భంగా అట్టడుగు వర్గాల కోసం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్‌జ (టాస్క్) ద్వారా కెరీర్ గెడైన్స్ సెల్‌ను ఆయన ప్రారంభించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కెరీర్ గెడైన్స్ సెల్‌కు సంబంధించి సలహాలు, సూచనల కోసం 040-48488241లో సంప్రదించాలని టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా సూచించారు. మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వంద మంది గిరిజన యువతకు ఇంగ్లిష్ భాషపై శిక్షణతో పాటు 50 మంది గిరిజన బాలికలకు ‘టాస్క్-మెంటర్’భాగస్వామ్యం కింద టాస్క్ మార్గనిర్దేశనం చేస్తుందని వన్ బ్రిడ్జి సంస్థ సీఈఓ మదన్ పేర్కొన్నారు.
Published date : 10 Aug 2020 02:19PM