గిరిజన స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్న నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టిన జెడ్ చోంగ్తూ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 15లోపు studycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. వివరాలకు 040- 27540104 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Published date : 11 Feb 2021 04:12PM