ఎస్వీయూసెట్ 2020 ప్రారంభం
Sakshi Education
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఎస్వీయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఎస్వీయూసెట్-2020 ప్రవేశ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
తొలిరోజు శుక్రవారం మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఆక్వాకల్చర్, ఎకనామిక్స్ సబ్జెక్ట్‌లకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఆయా సబ్జెక్టులకు మొత్తం 1,373 మంది దరఖాస్తు చేసుకోగా 987 మంది (71.9 శాతం) హాజరయ్యారు. 386 మంది హాజరుకాలేదు. శనివారం స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, పొలిటికల్ సైన్స్, బోటనీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.
Published date : 10 Oct 2020 12:39PM