ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ‘సీఐటీడీ’లోఉచిత వసతి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బాలానగర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)లో ఉచిత వసతి కల్పిస్తున్నట్లు తెలంగాణ ఎస్సీ అభివృద్ధి సంస్థ పేర్కొంది.
ఈ మేరకు వసతి సౌకర్యాల కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వ పరంగా భరించేందుకు అనుమతినిస్తూ ఎస్సీ అభివృద్ధి సంస్థ ఫిబ్రవరి 5న ఉత్తర్వులు జారీ చేసింది.
Published date : 06 Feb 2020 04:12PM