ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఎన్జీ రంగా వర్సిటీలో స్పాట్ కౌన్సెలింగ్
Sakshi Education
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ పి.గిరిధరకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విశ్వవిద్యాలయం పరిధిలో 2020–21 విద్యా సంవత్సరానికి ఆర్‌జీయూకేటీ సెట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు 81 మార్కుల నుంచి 9 మార్కుల వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. ఇందుకోసం శనివారం నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి రూ.600 (ఎస్సీ, ఎస్టీలకు రూ.300) ఫీజును డీడీ రూపంలో తీసి కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.
Published date : 10 Apr 2021 05:20PM