ఏపీపీసెట్-2020 ప్రవేశ పరీక్షలు ప్రారంభం
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీపీసెట్-2020 ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి ఏఎన్‌యూలో ప్రారంభమవుతున్నాయని ఏపీపీసెట్ కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ తెలిపారు.
ఈ నెల 17వరకు జరిగే ఈ ప్రవేశ పరీక్షలకు పురుషుల కేటగిరీలో 2,328 మంది, మహిళల కేటగిరీలో 768 మంది హాజరుకానున్నారు. ఈసారి శారీరక దారుఢ్య, క్రీడా నైపుణ్య పరీక్షల్లో మార్పులు చేశారు.
Published date : 12 Oct 2020 04:29PM