‘ఏపీపీఎస్సీ – గ్రూప్ 1’ అభ్యర్థుల వైద్య పరీక్షలకు మెడికల్ బోర్డు
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూపు 1తో సహా వివిధ పోస్టులకు అర్హత సాధించి ఎంపికయ్యే అభ్యర్థులకు వైద్య పరీక్షల కోసం మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదనల మేరకు గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. గ్రూప్ 1 మెయిన్స్ లో విజయం సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు జూన్ 17 నుంచి జూలై 9 వరకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అనంతరం అభ్యర్థులకు గుంటూరులో మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
Published date : 09 Jun 2021 01:09PM