ఏపీలో వెయ్యికి పైగా ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతుల కోసం వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విప్లవంలో భాగంగా సీఎం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి విభిన్న ప్రతిభావంతుల కోసం ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వైద్యం, ఆరోగ్యం, పాఠశాల, కళాశాల విద్య, వెనుకబడిన తరగతుల సంక్షేమం తదితర శాఖల్లో 668 బ్యాక్ లాగ్ ఉద్యోగాలు గుర్తించి వాటి భర్తీకి క్యాలెండర్‌లో నిర్దేశించిన విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాటిలో ఏపీపీఎస్సీ ద్వారా 62 ఖాళీలు, శాఖాధిపతుల ద్వారా 239, డీఎస్సీ ద్వారా 178, ఉపాధ్యాయుల డీఎస్సీ ద్వారా 189 ఖాళీల భర్తీకి తర్వలో నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు.
చదవండి: ఈ రెండేళ్లలో 6,03,756 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం జగన్
చదవండి: ఇగ్నో– 2021 కోర్సుల్లో వ్రేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published date : 21 Jun 2021 03:37PM