ఏపీలో ఉన్నత విద్య ప్లానింగ్ బోర్డు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పేందుకు ఉన్నత విద్య ప్లానింగ్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్లానింగ్ బోర్డు ఏర్పాటు ద్వారా కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థలు పరస్పర సమన్వయంతో ఉన్నత విద్యారంగంలో ఉన్నత ప్రమాణాల సాధనకు వీలుగా ముందడుగు వేయనున్నాయి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు, కాలేజీ విద్య కమిషనర్, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర వర్సిటీల వైస్ చాన్సలర్లు సభ్యులుగా ఉండే ఈ బోర్డుకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
Published date : 22 Jan 2021 02:59PM