ఏపీ సెట్– 2020 రెండో దశ కౌన్సెలింగ్ వాయిదా
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2020 రెండో దశ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
మార్చి 30 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెండో దశ సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
Published date : 29 Mar 2021 03:56PM