Skip to main content

ఏపీ మోడల్‌ స్కూళ్లలో 2021– 22 ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 164 మోడల్‌ స్కూళ్లలో (ఆదర్శ పాఠశాలల్లో) ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు మోడల్‌ స్కూళ్ల సొసైటీ కార్యదర్శి దుక్కిపాటి మధుసూదనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
2021–22 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో విద్యార్థులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని, ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన ఉండే ఈ స్కూళ్లలో ఎటువంటి ఫీజు వసూలు చేయరని చెప్పారు.

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశ అర్హతలు...
  • వయస్సు : ఓసీ, బీసీ విద్యార్థులు 01–09–2009 నుంచి 31–08–2011 మధ్య పుట్టి ఉండాలి . ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01–09–2007 నుంచి 31–08– 2011 మధ్య పుట్టి ఉండాలి.
  •  సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో చదివి ఉండాలి. 2020–21 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ప్రమోషన్‌ అర్హత పొంది ఉండాలి.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి ముందుగా www.cse.ap.gov.in/apms.ap.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలి. అభ్యర్థులు ఏప్రిల్‌ 16 నుండి మే 15 లోగా గేట్‌ వే ద్వారా అప్లికేషన్‌ రుసుము చెల్లించాలి. తరువాత వారికి ఒక జనరల్‌ నెంబరు కేటాయిస్తారు. ఆ నెంబరు ఆధారంగా ఏదైనా ఇంటర్నెట్‌ కేంద్రంలో www.cse.ap.gov.in/apms.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 50 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలి. లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాల్‌ని లేదా జిల్లా విద్యాశాఖాధికారి/ మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలి.
Published date : 16 Apr 2021 04:31PM

Photo Stories