ఏపీ ‘గురుకుల’ స్టాఫ్‌నర్స్ ఇంటర్వ్యూలు వాయిదా
Sakshi Education
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసేందుకు స్టాఫ్‌నర్స్ పోస్టులకు డిసెంబర్29న నిర్వహించాల్సిన వాక్‌ఇన్ ఇంటర్వ్యూను వాయిదా వేస్తున్నట్లు గురుకుల కార్యదర్శి కల్నల్ వి.రాములు బుధవారం తెలిపారు.
పరిపాలనా సంబంధమైన కారణాల వల్ల పూర్తిస్థాయిలో పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. పరీక్ష తేదీ తదితర వివరాలను అభ్యర్థులకు పత్రికా ముఖంగా తెలియజేస్తామని, www.apswreis.info వెబ్‌సైట్ ద్వారా కూడా వెల్లడిస్తామని తెలిపారు.
Published date : 24 Dec 2020 05:13PM