Skip to main content

ఏపీ ఎంసెట్, ఈసెట్, ఐసెట్’ల గడువు పొడిగింపు..!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేస్ రాష్ట్రంలో ఎంసెట్ సహా వివిధ కోర్సుల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.
సెట్ల వారీగా గడువు పొడిగింపు వివరాలు..
ఎంసెట్:
ఆలస్యరుసుము లేకుండా ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 10 వరకు, ఏప్రిల్ 15 వరకు రూ.1,000, ఏప్రిల్ 17వ తేదీ వరకు రూ.5,000, ఏప్రిల్ 19 వరకు రూ.10,000లతో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ఎంసెట్- 2020 స్టీడీ మెటీరియల్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, గెడైన్స్... ఇతర ఆప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి

ఈసెట్:
ఆలస్యరుసుము లేకుండా ఏప్రిల్ 9 వరకు, రూ.1,000 ఆలస్యరుసుముతో ఏప్రిల్16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐసెట్:
ఆలస్యరుసుము లేకుండా ఏప్రిల్ 9వ తేదీ వరకు. రూ.2,000 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 16 వరకు, ఏప్రిల్ 22 వరకు రూ.5,000, ఏప్రిల్ 25 వరకు రూ.10,000లతో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ఐసెట్- 2020 స్టీడీ మెటీరియల్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, గెడైన్స్... ఇతర ఆప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి
Published date : 24 Mar 2020 03:08PM

Photo Stories