ఏపీ ఎంసెట్ – 2021 ఇక ఏపీ ఈఏపీసెట్: మెడికల్ విభాగం తొలగింపు...షెడ్యూల్ ఇదే..
ఇంజనీరింగ్ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్ నిర్వహించేవారు. మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తుండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయించారు. మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్‌ను ఏపీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఆగస్టు 19 నుంచి 25 వరకు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
ఏపీ ఈఏపీసెట్– 2021 స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గైడెన్స్, బిట్ బ్యాంక్స్, మాక్ టెస్ట్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
షెడ్యూల్ ఇలా...
- అపరాధ రుసుము లేకుండా జూన్ 26 నుంచి జూలై 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రూ.500 ఫైన్‌తో జూలై 26 నుంచి ఆగస్టు 5 వరకు
- రూ.1,000 లేట్ ఫీజుతో ఆగస్టు 6 నుంచి 10 వరకు.. రూ.5,000 లేట్ ఫీజుతో ఆగస్టు 11 నుంచి 15 వరకు
- రూ.10 వేల అపరాధ రుసుముతో ఆగస్టు 16 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు.
సెప్టెంబర్‌లో ఇతర ప్రవేశ పరీక్షలు
ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో నిర్వహించే అవకాశం ఉందని మంత్రి సురేష్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
చదవండి: ఈ ఏడాది డిపార్ట్‌మెంట్ వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే..
చదవండి: కర్ణాటక కీలక నిర్ణయం: హిజ్రాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ …