ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. వీరిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియామకం
Sakshi Education
సాక్షి, అమరావతి: 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. 2,193 మంది డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమిస్తూ జూలై 21వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్జీటీలుగా మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. కాగా 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2008 డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరుగుతోంది.
13 ఏళ్లుగా పెండింగ్‌లో...
గత ప్రభుత్వం హయాంలో డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్న విషయం తెలిసిందే. మానవతా దృక్పథంతో డీఎస్సీ అభ్యర్ధుల సమస్యను పరిష్కరించామని అన్నారు. ‘డీఎస్సీ-2008’ సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. అభ్యర్థుల భవితవ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించారని తెలిపారు.

Published date : 21 Jun 2021 02:39PM