ఎన్‌టీఎస్‌ఈ- 2020 స్టేజ్ 1 ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 3న నిర్వహించిన జాతీయ ప్రతిభా పరీక్ష (రాష్ట్ర స్థాయి ఎన్‌టీఎస్‌ఈ) స్టేజ్-1 ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి ఫిబ్రవరి 6 (గురువారం)నఒక ప్రకటనలో తెలిపారు.
ఉత్తీర్ణత సాధించిన ఓబీసీ ఎన్‌సీఎల్ కేటగిరీ విద్యార్థులు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువపత్రాన్ని తమ కార్యాలయానికి ఈనెల 25వ తేదీ లోపల పంపాలన్నారు. అలా పంపని పక్షంలో ఎన్‌టీఎస్‌ఈ స్టేజ్-2 పరీక్షకు అనుమతి లభించదని పేర్కొన్నారు. ఎన్‌టీఎస్‌ఈ స్టేజ్ 1 ఫలితాలు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో లేదా www.bseap.org వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చునని చెప్పారు. స్టేజ్ 2 పరీక్ష మే 10వ తేదీన ఉంటుందని తెలిపారు.
Published date : 07 Feb 2020 02:36PM