‘ఎన్జీరంగా’ బీఎస్సీ దరఖాస్తుల గడువు డిసెంబర్ 15 వరకు పెంపు
Sakshi Education
గుంటూరు రూరల్ (ప్రత్తిపాడు): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ హానర్స్ యూజీ కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగించారు.
ఈ మేరకు రిజిస్ట్రార్ డాక్టర్ త్రిమూర్తులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో చివరి తేదీని డిసెంబర్ రెండుగా నిర్ణయించామని, అయితే గడువు తేదీని డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు.
Published date : 03 Dec 2020 05:12PM