Skip to main content

ఎన్‌ఈపీపై నేడు గవర్నర్ల సదస్సు

న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020)పై సోమవారం గవర్నర్ల సదస్సు జరగనుంది.
కేంద్ర విద్యాశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సదస్సును ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని పీఎంవో ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఉన్నత విద్య పరివర్తనలో ఎన్‌ఈపీ పాత్ర’అనే అంశంపై జరిగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్లు పాల్గొంటారు.
Published date : 07 Sep 2020 03:55PM

Photo Stories