Skip to main content

ఎన్‌ఏటీఏ– 2021 బీఆర్క్‌ ప్రవేశ పరీక్షకు డిప్లొమా హోల్డర్లూ అర్హులే!!

సాక్షి, అమరావతి: నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (ఎన్‌ఏటీఏ) 2021 బీఆర్క్‌ ప్రవేశ పరీక్షకు అర్హతల్లో కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (సీవోఏ) కొన్ని సడలింపులను ఇచ్చింది.
ఇప్పటివరకు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌ (10 ప్లస్‌ 2)లో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులై ఉన్న వారికి అర్హత కల్పిస్తూ వస్తున్నారు. తాజాగా డిప్లొమా హోల్డర్లు (10 ప్లస్‌ 3) విద్యార్థులకూ అవకాశం కల్పిస్తున్నట్లుగా సీవోఏ ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై అర్హత మార్కులు సాధించిన వారికి ఐదేళ్ల బీఆర్క్‌ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఈ పరీక్షకు దరఖాస్తు గడువును కూడా ఏప్రిల్‌ 1 వరకు సీవోఏ పొడిగించింది. ఏటా 2 సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 10న, జూన్‌ 12న పరీక్ష ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ‘ఎన్‌ఏటీఏ.ఐఎన్‌’ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Published date : 31 Mar 2021 04:27PM

Photo Stories