ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై శిక్షణ: ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి
Sakshi Education
సాక్షి, అమరావతి: ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై ఇండస్ట్రియల్ ఎక్స్‌పర్‌ట్సతో శిక్షణ ఇప్పించడం ద్వారా యువతలో నైపుణ్యాలు మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి అన్నారు.
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సేల్స్ ఫోర్స్ విభాగంలో వారం రోజుల ఉచిత ఆన్‌లైన్ శిక్షణను ఆయన సోమవారం ఏపీఎస్‌ఎస్‌డీసీ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్ శిక్షణలో బీటెక్, ఎంటెక్, పీజీ, డిగ్రీ పూర్తి చేసినవారు 450 మందికిపైగా పాల్గొన్నారని తెలిపారు. శిక్షణలో భాగంగా తొలిరోజు సీఆర్‌ఎం ఇంట్రడక్షన్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ అంశాలపై ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇచ్చామన్నారు. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీలపై యువతకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ డీవీ రామకోటిరెడ్డి కోరారు.
Published date : 16 Feb 2021 02:20PM