ఏఎస్‌డబ్ల్యూవో పోస్టుల భర్తీకి పభుత్వ ఆమోదం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దళిత అభివృద్ధి శాఖలో ఖాళీగా ఉన్న నాలుగు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి (ఏఎస్‌డబ్ల్యూవో) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఇటీవల దళిత అభివృద్ధి శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ శాఖలో పాలనాపరమైన ఇబ్బందులు రాకుండా ఈ నాలుగు పోస్టులను డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసుకునేందుకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌రోస్ ఫిబ్రవరి 13 (గురువారం)నఉత్తర్వులు జారీ చేశారు. ఈ భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తుందని, నిబంధనలకు అనుగుణంగా దళిత అభివృద్ధి శాఖ టీఎస్‌పీఎస్సీకి సమాచారం ఇవ్వాలని, తద్వారా టీఎస్‌పీఎస్సీ ఈ పోస్టులను భర్తీ చేస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
Published date : 14 Feb 2020 03:54PM