Skip to main content

ఢిల్లీ యూనివర్సిటీ వీసీ సస్పెండ్

న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ (వీసీ) యోగేశ్ త్యాగిని సస్పెండ్ చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్అక్టోబర్ 28నఉత్తర్వులు జారీ చేశారు.
విధుల నిర్వహణలో ఆయన వైఫల్యం చెందినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని రాష్ట్రపతి ఆదేశించినట్లు కేంద్ర విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. సాక్ష్యాధారాలు, రికార్డులను తారుమారు చేయకుండా ఉండడం కోసమే యోగేశ్ త్యాగిపై రాష్ట్రపతి సస్పెన్షన్ వేటు వేసినట్లు వెల్లడించాయి. దర్యాప్తు పారదర్శకంగా జరగాలన్నదే రాష్ట్రపతి ఉద్దేశమని పేర్కొన్నాయి. యోగేశ్ త్యాగి జూలై 2 నుంచి సెలవులో ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ప్రభుత్వం జూలై 17న పి.సి.జోషీని ఢిల్లీ వర్సిటీ వీసీగా నియమించింది. వర్సిటీ పరిపాలనలో వైస్ చాన్స్ల్‌గ్రా యోగేశ్ త్యాగి నియమ నిబంధనలు పాటించలేదని, ఫలితంగా అనేక ఇబ్బందులు తలెత్తినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
Published date : 29 Oct 2020 04:25PM

Photo Stories