దివ్యాంగుల కోటా భర్తీ కాకపోతే డీరిజర్వ్: జోసా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియలో దివ్యాం గుల కోటా సీట్లు భర్తీకాకపోతే వాటిని డీ రిజర్వ్‌లో పెట్టనున్నట్లు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) స్పష్టం చేసింది.
ఈ నెల 6 నుంచి నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ బిజినెస్ రూల్స్‌ను జోసా శుక్రవారం విడుదల చేసింది. ఈనెల 5న జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలను విడుదల చేసిన మరుసటిరోజు నుంచే ఈ కౌన్సెలింగ్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేసింది. గతేడాది బాలికలకు 17% సీట్లను సూపర్‌న్యూమరీ సీట్లను కేటాయించిన ఐఐటీలు ఈసారి 20% సీట్లను ప్రత్యేకంగా కేటాయించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. మొదటి దశ కౌన్సెలింగ్, సీట్ యాక్సెప్టెన్స్ తరువాత ఓపెన్ కేటగిరీ దివ్యాంగుల కోటాలో భర్తీ కాని సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా డీరిజర్వ్ చేసి, రెండో దశ సీట్ల కేటాయింపులో అందుబాటులో ఉంచనుంది. ప్రతి దశ కౌన్సెలింగ్‌లోనూ ఇలాగే చేయనుంది. జనరల్ ఈబ్ల్యూఎస్ ద్యివాంగుల కోటా సీట్లు భర్తీ కాకపోతే ఈడబ్ల్యూఎస్‌గా, ఓబీసీ నాన్ క్రీమీలేయర్ దివ్యాంగుల సీట్లు భర్తీ కాకపోతే ఓబీసీ నాన్‌క్రీమీలేయర్ కేటగిరీగా మార్చనుంది. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల సీట్లు భర్తీ కాకపోతే మిగిలిపోయిన సీట్ల ను ఎస్సీ, ఎస్టీ కోటాల్లో తదుపరి కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనుంది. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చాక లాక్ చేయాలని స్పష్టం చేసింది. మొదటి దశలో సీట్లు లభించిన విద్యార్థులు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొంది.
ఎప్పుడైనా విత్ డ్రా చేసుకునే అవకాశం
ఆరు దశల కౌన్సెలింగ్‌లో రెండో దశ సీట్ల కేటాయింపు తరువాత నుంచి చివరి దశ కౌన్సెలింగ్‌కు(ఆరోదశ) ముందువరకు సీట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని జోసా పేర్కొంది. ఒకసారి సీట్ అలొకేషన్ ప్రాసెస్ నుంచి విత్‌డ్రా అయితే కేటాయించిన సీటు కూడా రద్దు అవుతుంది. మళ్లీ ఏ దశలోనూ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి వీలు ఉండదని స్పష్టం చేసింది. జోసా కౌన్సెలింగ్ ఫీజు రూ.2,000, చెల్లించాలని, సీట్ యాక్సెప్టెన్సీకి జనరల్ కేటగిరీ వారు రూ.35 వేలు, ఇతర అన్ని కేటగిరీల వారు రూ.15 వేలు చెల్లించాలని వెల్లడించింది. మొదటి దశలో సీట్ యాక్సెప్టెన్సీ తప్పనిసరిగా చేయాలి..లేకపోతే కౌన్సెలింగ్ ప్రాసెస్ నుంచి తొలగిపోయినట్లు అవుతుంది.

Published date : 03 Oct 2020 03:00PM