డిసెంబర్‌లో ఒలింపియాడ్ పరీక్షలు
Sakshi Education
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): ప్రపంచ వ్యాప్తంగా ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహిస్తున్న సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ (ఎస్‌ఓఎఫ్) ఈ ఏడాది ఆన్‌లైన్ ద్వారా ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఓఎఫ్ వ్యవస్థాపకుడు, డెరైక్టర్ మహవీర్‌సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షలు డిసెంబర్ 19, 20, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్షలు డిసెంబర్ 26, 27 తేదీల్లో నిర్వహించనున్నామన్నారు. విద్యార్థులు పరీక్షకు 15 రోజుల ముందుగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పరీక్షల్లో ప్రతిభ చూపినవారికి అవార్డులు, బహుమతులు, ఉపకారవేతనాలు అందజేయనున్నట్లు తెలిపారు.
Published date : 23 Nov 2020 02:12PM