Skip to main content

డిసెంబర్ 26న ఐసెట్ సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల (ఐసెట్) కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు డిసెంబర్ 26న సీట్లను కేటాయించనున్నట్లు తెలంగాణ ప్రవేశాల కమిటీ తెలిపింది.
చివరి దశ కౌన్సెలింగ్‌లో 7,602 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని ఓ ప్రకటనలో వెల్లడించింది. సీట్ల కేటాయింపు వివరాలను తమ వెబ్‌సైట్‌లో (https://tsicet.nic.in) అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.
Published date : 25 Dec 2020 03:38PM

Photo Stories