డిసెంబర్ 18న పీజీ.. 19న డిగ్రీ పరీక్షలు: ఉస్మానియా వర్సిటీ
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో డిసెంబర్ 18 నుంచి వివిధ పీజీ కోర్సుల (రెగ్యులర్) రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
డిసెంబర్ 19 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల ఇయర్ వైజ్ పరీక్షలు జరగనున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ. శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఓయూ ప్రీ-పీహెచ్‌డీ పరీక్షలు డిసెంబర్28, 30 తేదీలలో నిర్వహిస్తామన్నారు. పీహెచ్‌డీ విద్యార్థులు జంటనగరాలతో పాటు ఆయా జిల్లాల్లో పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఓయూ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
Published date : 08 Dec 2020 04:35PM