Skip to main content

దీక్ష పోర్టల్‌ ఆధ్వర్యంలో ప్రైమరీ టీచర్లకు శిక్షణ: ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, పేదరికాన్ని పారదోలేందుకు విద్యే సాధనమని ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ టీచర్లకు దీక్ష పోర్టల్‌ ఆధ్వర్యంలో సోమవారం ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. సీబీఎస్‌ఈ విధానం అమలు జరగనున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. బోధన విధానంలో మార్పు అనివార్యమని, కేవలం సమాచారం అందించడమే కాకుండా 21వ శతాబ్ది నైపుణ్యాల సాధన దిశగా బోధన సాగాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘నూతన జాతీయ విద్యావిధానం–2020’ మార్గదర్శకాల ఆధారంగా నూతన పాఠ్య పుస్తకాలు రూపొందించినట్టు చెప్పారు. 2019–20 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఆరు తరగతులకు, 2020–21 విద్యా సంవత్సరంలో ఏడో తరగతికి నూతన పాఠ్య పుస్తకాలు రూపొందాయన్నారు. ‘మన బడి, నాడు–నేడు’, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి వంటి కార్యక్రమాల ద్వారా పేద పిల్లల చదువుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సురేష్‌ చెప్పారు.
Published date : 22 Jun 2021 01:31PM

Photo Stories