డీఎడ్ కళాశాలలు తక్షణమే పునః ప్రారంభించాలి
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డీఎడ్ కళాశాలలన్నీ వెంటనే తిరిగి ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్.ఆర్ కాంతారావు ఆదేశించారు.
ఈ నెల 2వ తేదీ నుంచి అన్ని డీఎడ్ కళాశాలలు పున:ప్రారంభించాలని ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిందని, పలు కళాశాలలు దీన్ని బేఖాతరు చేస్తూ ఇంకా తరగతులు ప్రారంభించ లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 19 Nov 2020 01:44PM