Skip to main content

డిగ్రీ దరఖాస్తుల గడువు మరో రోజు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును మరొక రోజు పొడిగించినట్లు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు బుధవారం కూడా డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు రిజస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోని వారు కూడా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. కాగా, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించినా వీలుకాని పరిస్థితుల్లో పరీక్షలకు హాజరు కాని వారిని పాస్ చేయాలని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ విజ్ఞప్తి చేశారు. డిగ్రీ ప్రవేశాల గడువు ముగుస్తున్నందున విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సీఎం కేసీఆర్ దృష్టి సారించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసినపుడే వారిని కూడా పాస్ చేస్తామని చెప్పారని, అయినా ఇంతవరకు నిర్ణయం వెలువడలేదని తెలిపారు. ఈ నిర్ణయంతో దాదాపు 27 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.
Published date : 09 Sep 2020 02:29PM

Photo Stories