బ్రేకింగ్ న్యూస్:ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం..నేడే 2021–22 జాబ్ క్యాలెండర్ విడుదల..ఈ ఏడాది కూడా భారీగా..
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను జూన్ 18వ తేదీన (నేడు) ఆయన విడుదల చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్న సీఎం.. నిరుద్యోగులకు అండగా ఉండేలా మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుడుతున్నారు. 2021–22లో భర్తీకి నిర్ణయించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు జూలై నెల నుంచే విడుదల కానున్నాయి. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, డీఎస్సీ తదితర నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అత్యంత పారదర్శకంగా, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
గ్రూప్–1, గ్రూప్–2తో సహా అన్ని పరీక్షలకు ఇంటర్వ్యూలు రద్దు..:
ప్రభుత్వ పోస్టులను ఎలాంటి అవినీతి, అక్రమాలకు, లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శక విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో బాగంగా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. గ్రూప్–1, గ్రూప్–2తో సహా అన్ని ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు ఐఐటీ, ఐఐఎంల సహకారంతో విప్లవాత్మక విధానాన్ని రూపొందించనున్నారు.
దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు 6,03,756 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1,84,264, కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్ సోర్సింగ్ పోస్టులు 3,99,791 ఉన్నాయి. కేవలం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇన్ని పోస్టులు భర్తీ చేయించిన ఘనత వైఎస్ జగన్‌దే. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు.
కేటగిరీ పోస్టుల సంఖ్య నోటిఫికేషన్
ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్‌లాగ్ పోస్టులు 1,238 జూలై 2021
ఏపీపీఎస్సీ గ్రూప్–1, గ్రూప్–2 36 ఆగస్టు 2021
పోలీసు 450 సెప్టెంబర్ 2021
డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు (వైద్య శాఖ) 451 అక్టోబర్ 2021
పారామెడికల్, ఫార్మాసిస్టు, టెక్నీషియన్లు 5,251 నవంబర్ 2021
నర్సులు 441 డిసెంబర్ 2021
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు 240 జనవరి 2022
వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2,000 ఫిబ్రవరి 2022
ఇతర శాఖల పోస్టులు 36 మార్చి 2022
మొత్తం 10,143
2019 నుంచి ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలు ఇలా..
శాఖ పోస్టులు
గ్రామ, వార్డుల వలంటీర్లు : 2,59,565
గ్రామ, వార్డు సచివాలయాల అసిస్టెంట్లు: 1,21,518
వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమం: 13,987
ఆర్ అండ్ బీ, ఆర్టీసీ ఉద్యోగులు: 58,388
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు (ఆప్కాస్): 95,212
ఏపీపీఎస్సీ: 2,497
పశుసంవర్ధక, మత్స్య శాఖలు: 372
వ్యవసాయ, సహకార శాఖలు: 175
ఆహార, పౌర సరఫరాల శాఖ: 237
పాఠశాల విద్య: 4,758
ఉన్నత విద్య: 1,054
గిరిజన సంక్షేమం: 1,175
సాంఘిక సంక్షేమం: 669
మహిళా, శిశు అభివృద్ధి, వయోజన శాఖ: 3,500
నైపుణ్యాభివృద్ధి: 1,283
విద్యుత్ శాఖ: 8,333
జల వనరుల శాఖ: 177
ఇతర శాఖలు: 4,531
కోవిడ్ సమయంలో అత్యవసర
సేవలకునియమితులైన
తాత్కాలిక సిబ్బంది: 26,325
మొత్తం: 6,03,756.