Skip to main content

బ్రేకింగ్ న్యూస్‌: ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌ని రాష్ట్రాల‌కు సుప్రీం కోర్టు నోటిసులు

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: దేశంలో ఇంకా ప‌రీక్ష‌ల‌ను రద్దు చేయ‌ని రాష్ట్రాల‌కు సుప్రీంకోర్టు నోటిసుల‌ను జారీ చేసింది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా మ‌రికొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంకా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌లేదు. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల్లో ప‌రీక్షలు జ‌ర‌గాగ..మిగ‌తా రాష్ట్రాలు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశాయి. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌ని రాష్ట్రాల‌కు నోటిసులు పంపిన సుప్రీం కోర్టు...సోమ‌వారంలోగా త‌మ వాద‌న‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాలని ఆదేశించింది. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌ని రాష్ట్రాలు సోమవారం జ‌రిగే కోర్డు విచారంలో త‌మ వాద‌న‌ను తెలియ‌జేయాల‌ని కోర్టు తెలిపింది. నేడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే సీఎం స‌మీక్ష స‌మావేశంలో.. ప‌రీక్ష‌లు జ‌రుగుతాయో..లేదో..అనే ఉత్క‌ఠ‌కు తెర‌ప‌డ‌నుంది.
Published date : 17 Jun 2021 03:00PM

Photo Stories