బ్రేకింగ్ న్యూస్: జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష తరగతులకు తాత్కాలిక బ్రేక్ పడింది. స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన కాకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే తరగతుల నిర్వహణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.
9, 10 తరగతులకు కూడా ఆన్‌లైన్‌లోనే బోధన నిర్వహించనుంది. 50 శాతం టీచర్లు ఒకరోజు.. మరో 50 శాతం టీచర్లు తర్వాతి రోజు హజరయ్యేలా చూడనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
Published date : 26 Jun 2021 07:50PM